ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు పంపింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల విడిపోతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో ఈనెల 14న విచారకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై గత ఆగస్టులోనే నోటీసులు పంపగా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.