ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రస్తుతం అందుతున్న పథకాలు అన్నీ కొనసాగుతాయని, ఈ సర్వే చేసిన తర్వాత కొన్ని స్కీమ్లు రద్దు చేస్తారనే మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థిక, సామాజిక, విద్యా, కులానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడమేనని పేర్కొన్నారు.