జింబాబ్వేలోని జాంబేజీ నేషనల్ పార్క్‌లో కొన్ని ఏనుగులు నీళ్లు తాగడానికి ఓ నది వద్దకు వెళ్లాయి. నది ఒడ్డున నిలబడిన ఏనుగులు వరుసగా నీళ్లు తాగుతుంటాయి. అక్కడ నక్కి ఉన్న ఓ మొసలిని గమనించిన ఏనుగులు అప్రమత్తమవుతాయి. వాటిలో ఓ ఏనుగు నదిలో కాస్త లోతుగా వెళ్లి తాగుతుంటుంది. అక్కడున్న మొసలి ఏనుగు తొండాన్ని పట్టుకుంటుంది. ఈ క్రమంలో ఏనుగు మొసలినే ఒడ్డుకు లాక్కొచ్చి తొండంతో గట్టిగా విదిలించడంతో మొసలి ఏనుగును వదిలేస్తుంది.