పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రొద్దంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించగా, ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య అధిపత్య పొరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.