పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీకి చేసిన హెచ్చరికపై ఆ పార్టీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపైన పేర్ని నాని ఘాటుగా స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వేధించే వారికి తాము పది రెట్లు తిరిగి అధికంగా ఇస్తామని హెచ్చరించారు. అధికార మదంతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.