ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో విమానాశ్రయం లేదు. ఐరోపాలోని మొనాకోలోనూ ఎయిర్ పోర్ట్ లేదు. దీంతో ప్రజలు ఇక్కడికి రావడానికి ఫ్రాన్స్ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. మరోవైపు, ఇటలీతో చుట్టుముట్టబడిన శాన్ మారినో, స్విట్జర్లాండ్ & ఆస్ట్రియా మధ్య ఉన్న లీచెన్ స్టయిన్ లో కూడా ఎయిర్ పోర్టులు లేవు. అలాగే ఫ్రాన్స్ & స్పెయిన్ మధ్య ఉన్న అండోరా దేశంలోనూ ఒక్క విమానాశ్రయం లేదు.