అమెరికాకు చెందిన లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ హెక్సా పేరిట ఒక ఎగిరే కారును తయారు చేసింది. చూడటానికి ఓ పెద్ద డ్రోన్ తరహాలో కనిపించే ఈ ‘హెక్సా’ను ఇటీవల జపాన్‌లోని టోక్యోలో ప్రదర్శించారు. దీనిని నడిపిన వ్యక్తి.. పది, పన్నెండు మీటర్ల ఎత్తులోకి కారును తీసుకెళ్లి.. అటూ ఇటూ తిప్పుతూ అందరికీ అభివాదం చేశాడు. దీన్ని నేల మీదే కాదు.. నీటిలోనూ ల్యాండ్ చేయవచ్చట. కాకపోతే దీనిలో ఒక్కరు మాత్రమే ప్రయాణించవచ్చు.