డెహ్రాడూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఓ చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఓ లారీ ముందు నుంచి ద్విచక్రవాహనదారుడు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వారిని గమనించని లారీ డ్రైవర్ బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.