మేకను వధించి రక్తం తాగిన పూజారి మృతి

69122చూసినవారు
మేకను వధించి రక్తం తాగిన పూజారి మృతి
తమిళనాడులోని ఈరోడ్ కోపిచెట్టిపాళయం సమీపంలోని ఆలయ ఉత్సవాల్లో మేకను కోసి దాని రక్తం తాగిన పూజారి స్పృహతప్పి పడి చనిపోయాడు. నల్లకౌండన్‌పాళ్యం బాలాజీ నగర్‌కు చెందిన పళనిస్వామి (45)తో పాటు 5 మందికి పైగా పూజారులు పారణ కితై పూజలో అరటిపండ్లు రక్తంలో కలిపి తిన్నారు. దీంతో వాంతులు చేసుకుని, స్పృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :