6 నెలల పసికందుకు తల్లి కాలేయం అమర్చిన వైద్యులు

56చూసినవారు
6 నెలల పసికందుకు తల్లి కాలేయం అమర్చిన వైద్యులు
ఆరు నెలల పసికందుకు చెన్నైలోని గ్లెనెగల్స్‌ హెల్త్‌సిటీ వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. భూటాన్‌కు చెందిన చిన్నారి పుట్టుకతోనే కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చెన్నై రాగా, వైద్యులు ఆ ఆరు నెలల పసికందుకు తల్లి కాలేయాన్నే అమర్చారు. ఈ మేరకు వివరాలను డాక్టర్‌ జాయ్‌ వర్గీస్‌, డాక్టర్‌ సోమశేఖర, డాక్టర్‌ నగేష్‌ కె.రావ్‌, డాక్టర్‌ రజనీకాంత్‌, డాక్టర్‌ సెల్వకుమార్‌ మల్లీశ్వరన్‌ తదితరులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్