వరుస దాడులు.. హోటళ్ల యాజమాన్యానికి దడ

81చూసినవారు
వరుస దాడులు.. హోటళ్ల యాజమాన్యానికి దడ
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు.. హోటల్స్, రెస్టారెంట్ యాజమాన్యానికి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. చాలా వరకు హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం, గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయించడం వంటివి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే కేవలం స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలోనే కాదు బడా బడా రెస్టారెంట్లలోనూ ఇలాంటి సంఘటనలు గుర్తించడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్