జంగిల్ సఫారీలో పర్యాటకులు వింత అనుభూతులను పొందవచ్చు. తాజాగా రాజస్థాన్ రణతంబోర్ నేషనల్ పార్క్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు పర్యాటకులు పార్క్‌లో సఫారీకి వెళ్లారు. ఓ పెద్ద గోడ పక్కన వాహనాలు ఆపుకొని దూరంగా ఉన్న పులులను చూస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద పులి సడన్‌గా గోడపైకి దూకింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.