యూపీలోని ఫతేపూర్ జిల్లా లాలౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాల వల్ల యమునా నదికి వరద పోటెత్తింది. వరద నీటిలో ఓ యువకుడు బైక్‌పై ముందుకు వెళ్లాలని భావించాడు. అయితే వరద ప్రవాహంలో బైక్‌తో సహా ఆ యువకుడు కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరాడు. తృటిలో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.