గొప్ప మనసు చాటుకున్న యూట్యూబర్

85చూసినవారు
ప్రపంచంలోనే అత్యధిక మంది సబ్‌‌స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్ మిస్టర్‌బీస్ట్ అలియాస్ జిమ్మీ డోనాల్డ్ సన్ గొప్ప మనసు చాటుకున్నాడు. దాదాపు 2 వేల మంది కాళ్లను కోల్పోయిన వికలాంగులకు ఆసరాగా నిలిచారు. 5 వేల నుంచి 50 వేల డాలర్ల విలువైన కృత్రిమ కాళ్లను వారికి అందజేశారు. ఇప్పటివరకు వీల్ చైర్‌కు పరిమితమైన వికలాంగులు తిరిగి నడిచేలా చేశారు. గతంలోనూ ఎన్నో సేవ కార్యక్రమాలను చేశారు. ‘మనసున్న మారాజు’ అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్