కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని, అదానీ, అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారవేత్తలకు మద్దతుగా విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ కార్యదర్శి విలాస్ ఆరోపించారు. ఆదిలాబాద్ లోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ జిల్లా అత్యవసర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దేశంలో కేంద్రం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు.