భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బేల మండలంలోని పలు గ్రామాలలో పంట నష్టపోయిన రైతుల పొలాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పత్తి పంటను పంటలను పరిశీలించి రైతుకు భరోసా కల్పిస్తూ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.