అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

536చూసినవారు
అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
సమ్మె సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలన్నారు. 60 ఏళ్ళు నిండిన వారికి విఆర్ఎస్ తీసుకునే సౌకర్యం కల్పించాలని కోరారు.