ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సోమవారం రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ భూ సేకరణ కోసం వెళ్ళినప్పుడు జిల్లా కలెక్టర్, రెవిన్యూ సిబ్బందిపై గ్రామస్తులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం సభ్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారువృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.