భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో జరిగింది. భీమిని మండలానికి చెందిన జంగంపల్లి రాకేష్ ఈనెల 13న నెన్నెల మండలం అత్తగారింటికి వెళ్లాడు. తాగుడుకు బానిసైన రాకేష్ తో గొడవ పెట్టుకుని భార్య గౌరు పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకువెళ్లేందుకు రాకేష్ అత్తగారింటికి వెళ్లాడు. సోమవారం తాగుడు మానితేనే ఇంటికి వస్తానని భార్య చెప్పడంతో మనస్థాపానికి గురైన రాకేష్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.