బోథ్ మండల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాగులు, కాలువలు, చెరువుల దగ్గరకు వెళ్ళకూడదు. వర్షంలో వాహనాలను నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మండలంలో లోలేవల్ వంతెన వల్ల నక్కలవాడతో పాటు పలు ప్రాంతాల ప్రజలకు వరద ప్రవాహం పై అవగాహన కల్పించామని ఎస్సై రాము ఆదివారం తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని అన్నారు.