భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని ఇచ్చోడ ఎస్సై నరేష్ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే 100కి లేదా సిఐ 712659936, ఎస్సై 712659944 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.