తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమన్ని గురువారం హెచ్ఎం వెంకట్ రావు ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించేలా రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు ప్రతిరోజు వివిధ అంశాలలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత, తదితర విషయాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం ఉంటాయని తెలిపారు.