మంచిర్యాల: భద్రతకై మహిళా ఉద్యోగులు పోరాడాలి
పని స్థలాలలో మహిళా కార్మికులు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు డి. బ్రహ్మానందం తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ రంగ సంస్థలో భద్రతకై మహిళా కార్మికులు, ఉద్యోగులు పోరాడాలని పిలుపునిచ్చారు.