భీమారం: గ్రామ సభల్లో గందరగోళం
మంచిర్యాల జిల్లా భీమారం మండలం పొలంపెల్లిలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని, గ్రామ సభను రద్దుచేసి, మళ్ళీ గ్రామంలో సర్వే చేపట్టాలని అధికారులను నిలదీశారు.