Feb 28, 2025, 12:02 IST/
RSP అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది: కోనప్ప అనుచరులు
Feb 28, 2025, 12:02 IST
TG: BRS నేత, మాజీ ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్ కుమార్ అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు ఆరోపించారు. కాగజ నగర్ లో BRS నేతలు చేసిన అరాచకలను బయటపెట్టినందుకు తమను చంపుతామని బెదిరిస్తున్నారని ఓ వీడియో విడుదల చేశారు. తమ ఇళ్లలోకి అర్ధరాత్రి వచ్చి దాడి చేసి ఇంట్లో ఆడవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.