ఆగ్రాలో ఫిబ్రవరి 24న భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న TCS మేనేజర్ మానవ్ శర్మ భార్య నికితా శర్మ తాజా ఘటనపై స్పందించింది. మానవ్ శర్మ చేసిన ఆరోపణలను ఖండించింది. ‘అతను అతిగా తాగేవాడు. నేను నా అత్తమామలకు చాలాసార్లు సమాచారం ఇచ్చాను. కానీ వారు నా మాటలను పట్టించుకోలేదు’ అని తెలిపింది. తనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణను తోసిపుచ్చింది.