ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. "రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం. గతంలో స్కాముల ప్రభుత్వాలను చూశాం..ఇప్పుడు స్కీముల ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా బీజేపీకి 52 శాతం ఓట్లు వస్తాయని ఓ సర్వేలో తేలింది" అని అన్నారు.