ఇటీవల ఫుడ్ కల్తీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బయట ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిప్థితి ఏర్పడింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఆకుకూరలను మురికి నీటిలో కడుతుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. మహారాష్ట్రలోని థానే ఉల్హాస్‌నగర్‌లోని ఖేమాని కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు.