అందుబాటులో ఉంటూ రోగులకు వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే

54చూసినవారు
ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు. రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. డా. అనిల్ కుమార్, వైద్య సిబ్బంది, మండల నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్