చిన్నారులపై వీధి కుక్కల దాడి

11604చూసినవారు
చిన్నారులపై వీధి కుక్కల దాడి
కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు తానూర్ మండలంలోని తోండాల గ్రామంలో ఆదివారం వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారులు ఆడుకుంటుండగా ఆదిత్య, సాయినాథ్, విలాస్ పై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చినట్లు కుటుంబీకులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ధర్మాబాద్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టేలా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్