కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి కార్యకర్త 200 మందిని బిజెపిలో సభ్యులుగా నమోదు చేయాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల కార్తీక్ అన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఆదివారం నిర్మల్ పట్టణంలోని బాలాజీ వార్డులో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క బూత్ లెవెల్ సభ్యులు వేగవంతంగా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని సూచించారు.