దిలావర్‌పూర్‌లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి కేటీఆర్ పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని గురువారం సవాల్ విసిరారు.