$100 బిలియన్ల క్లబ్‌లోకి ఆదిత్య బిర్లా గ్రూప్

60చూసినవారు
$100 బిలియన్ల క్లబ్‌లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెట్ విలువ $100 బిలియన్ల మార్క్ (రూ.8,51,460 కోట్లు) దాటింది. దీంతో టాటా గ్రూప్, అదానీ ఎంటర్ప్రైజెస్, రిలయన్స్ తదితర సంస్థల జాబితాలో చేరింది. ఈ గ్రూప్ కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో సహా 12 సంస్థల షేర్లు పుంజుకోవడంతో ఈ ఘనత సాధించింది. మార్కెట్ విలువ దాదాపు 35% అల్ట్రాటెక్ సిమెంట్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 2.95లక్షల కోట్లుగా ఉంది.

ట్యాగ్స్ :