ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60 ఏండ్ల వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది. 40 ఏండ్ల ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ ఏడో వ్యక్తి ఈయన. బాధితుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్టు వైద్యులు గురువారం ప్రకటించారు. ఇతడికి 2015లో ప్రమాదకరమైన, నొప్పితో కూడుకున్న స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టు తెలిపారు.