హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. రోడ్లపై వెళ్లే వాహనాలు, భారీ సరుకు రవాణా వెహికల్స్, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్ క్రాకర్స్ కాల్చటం, లౌడ్ స్పీకర్లు, డీజేలు తదితర కారణాలతో చెవులకు చిల్లులు పడుతున్నాయి. నిశ్శబ్దంగా ఉండాల్సిన విద్యాలయాలు, ఆసుపత్రుల వద్ద కూడా విపరీత శబ్దాలుండటం వివిధ రకాల సమస్యలకు దారితీస్తోంది. కొందరికి మానసిక, మరికొందరికి నాడీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.