ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు అజిత్ ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బీజేపీ, శివసేన శాసనసభాపక్ష సమావేశాలు కూడా ఈరోజే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండడంతో సీఎం అభ్యర్థి ఎంపికపై కూటమి పార్టీలు త్వరితగతిన కసరత్తు చేస్తున్నాయి.