న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025కు దరఖాస్తు గడువు నవంబర్ 22న ముగియనుంది. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. నవంబర్ 23-29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. వివరాలకు వెబ్సైట్ https://upsc.gov.in/ చూడొచ్చు.