ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ మిడ్ లాండ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన హర్షితా బ్రెల్లా(24) దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి కారు డీక్కిలో హర్షితా బ్రెల్లా మృతదేహాన్ని యూకే పోలీసులు గుర్తించారు. ఆమె భర్తే పంకజ్ లాంబనే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్యను హత్య చేసిన అనంతరం అతడు దేశం విడిచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.