భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరుగనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నది. తొలిసారిగా ఈ రైలును జింద్ – సోనిపట్ మార్గంలో నడుపనున్నారు. 2030 నాటికి భారత్‌లో కార్బన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్‌గా పేరు పెట్టింది.