ఎన్టీఆర్‌ ‘వార్ 2’ లో అలియా భట్

72చూసినవారు
ఎన్టీఆర్‌ ‘వార్ 2’ లో అలియా భట్
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌ పోషిస్తుండగా తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

ట్యాగ్స్ :