ముంబై విమానాశ్రయంలో శనివారం ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అవ్వటంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైడీజీసీఏ ఆదేశించడంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించింది. ఈ రెండు విమానాలు దగ్గరిగా వచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.