హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు రాగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే ఈ బాండ్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 05న బాండ్ డేను పురస్కరించుకొని ఇప్పటివరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.