శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం?

59చూసినవారు
శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం?
TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బన్నీ, అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి దాదాపు రూ.2 కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్