మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వీడియో వైరల్

55చూసినవారు
రాజస్థాన్‌లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా మరో జవాన్ ఇసుకలో గుడ్డును ఉడకబెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని బికనీర్ సరిహద్దు వద్ద జవాన్లు కాపలా కాస్తున్నారు. అక్కడి ఎండల తీవ్రతను కళ్లకు కట్టేలా చూపించడానికి ఓ జవాన్ ఇసుకలో గుడ్డును ఉంచాడు. కాసేపటికే అది ఉడికి పోయింది.