నీటిని తక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీరు లేనప్పుడు, మూత్ర పరిమాణం తగ్గుతుంది. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. మూత్రం ఎక్కువగా బయటకు రాకపోవడంతో ఈ ఖనిజాలు స్ఫటికాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే ప్రతిరోజు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.