తెలంగాణలో ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి: మాజీ మంత్రి

78చూసినవారు
TG: రాష్ట్రంలో ఎక్కడ చూసిన ధర్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల ఓట్లు కావాలి కానీ.. వారు పండించిన వడ్లు మాత్రం వద్దంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతుల పరిస్థితి ఎలా ఉందని ఒక్క రోజైనా రివ్యూ చేశాడా? ఒక్క అధికారినైనా అడిగాడా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్