ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. చంద్రబాబు,పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఎక్కడా చిన్న వివాదం కూడా రాకుండా ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రతి నిర్ణయాన్ని చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన క్యాడర్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారితోనే సమస్యలు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.