ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాలు ‘కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ థీమ్‌తో 2025 జనవరి 20-24 మధ్య దావోస్‌లో జరగనున్నాయి. ఈ అంతర్జాతీయ సమావేశాల్లో మన దేశం నుంచి 100 మందికిపైగా వ్యాపార, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. భారత్ నుంచి కేంద్రమంత్రులు, దిగ్గజ వ్యాపార సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, ఉన్నతాధికారులు పాల్గొంటారు.