సౌదీ అరేబియా ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్‌పీ హక్కుల సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది. తాజాగా నాజ్రాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో యెమెన్ దేశానికి చెందిన ఒక వ్యక్తిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఉరి తీసినట్టు సౌదీ మీడియా తెలిపింది. దీంతో ఈ ఏడాది దేశంలో ఉరితీసిన విదేశీయల సంఖ్య 101కు చేరింది. 2022, 2023లో ప్రతి ఏడాది 34 మందిని ఉరితీశారు.