సల్మాన్ ఖాన్‌పై దాడికి మరో కుట్ర

66చూసినవారు
సల్మాన్ ఖాన్‌పై దాడికి మరో కుట్ర
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై దాడికి చేసిన మరో కుట్ర బయపడింది. ముంబైలో సల్మాన్‌ కారుపై దాడికి ప్లాన్‌ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుంచి సేకరించిన ఆయుధాలతో సల్మాన్‌పై దాడి చేయడానికి వీరు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ వాహనం లేదా ఆయన ఫామ్ హౌస్ పై దాడి చేయడానికి ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు.